ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపిటిసి ఎండి మసూద్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బచ్చన్నపేట మండలంలో జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి సహకారం తో నిరుపేదలందరికీ పథకం అందే విధంగా కృషి చేస్తామని అన్నారు .జూన్ 2, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం, పేద, ధనిక తేడా లేకుండా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఈ పథకం నిలుస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిది అన్నారు.ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అకాల మరణం చెందినప్పుడు ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పరిహారం ఈ పథకం ద్వారా అందుతుందని అన్నారు. రేషన్ కార్డు ఉన్న దాదాపు 1.15 కోట్ల కుటుంబాలన్నీ పేద, మధ్యతరగతిఈ పథకానికి అర్హులని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని నిరూపించుకుందని దిమా వ్యక్తం చేశారు











