పులిమామిడి గ్రామంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 05:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని..పులిమామిడి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున అధ్యక్షులు రేవెల్ల సాయికుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
*బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు, వివక్షలను ఎదుర్కొంటూ ఆయన తన విద్యను కొనసాగించారు. తన కష్టపడే స్వభావం, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి విశేష సేవలు అందించారు.ఆయన భారతదేశానికి చెందిన గొప్ప నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు. పేదల, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఎంబడి రమేష్ , ఉప సర్పంచ్ పాపగాళ్ళ రాములు, వార్డు సభ్యులు , బట్టు ఆంజనేయులు , జల ప్రవీణ్ , పాపగల్ల మహేష్ , బట్టు శ్రీవాణి మల్లేష్ , కారుబర్ మహేంద్ర , మహేష్ , సంఘ నాయకులు సెక్రెటరీ వత్తుల కార్తీక్ , ఉపాధ్యక్షులు మహేష్ , శేఖర్, శివ, నరేష్, అరుణ్, కిరణ్, చంటి, గ్రామ పెద్దలు రాములు, రవీందర్, యాదయ్య, సురేష్ , దర్శన్, సురేష్, నాగేష్ , మరియు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.*











