*మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి*.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 10 ఏప్రిల్ 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రం సొసైటీ ఆవరణలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో , ఏర్పాటు చేసిన మక్కలు(మొక్క జొన్నలు ) కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు కనీస మద్దతు ధర క్వింటాల్
రూ 2400 అందిస్తున్నామని. గతంలో కూడా ఉచిత విద్యుత్ తో రైతులకు ఎంతో మేలు జరిగిందని , ఇప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశలకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వేముల సాంబయ్య, మండల పార్టీ అధ్యక్షులు సిద్దెన రమేష్, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, సర్పంచ్ కంది శ్వేత కృష్ణచైతన్య రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పెట రమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు బండి హరీష్,సర్పంచులు గూడా మహేందర్, మైదాó రాకేష్, భూక్యా హనుమ నాయక్, భాస్కర్,మాజీ సర్పంచ్ హంస విజయరామ రాజు, మండల నాయకులు మహేందర్ రెడ్డి, మచ్చిక రాంబాబు, చాపలా మధుకర్,మేండే విజేందర్, మండల నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.











