*కస్తూర్బా గాంధీ గారి ఆశయాలు సాధించాలి షేక్ హాజీ బాబా
*మహేశ్వరం మండలం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల్ అధ్యక్షులు షేక్ హాజీ బాబా*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధురాలు మహాత్మా గాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ 157 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు
కస్తూరిబాయి మఖంజీ కపాడియా
1869 ఏప్రిల్ 11
పోర్బందర్, పోర్బందర్ రాష్ట్రం, కతియావార్ ఏజెన్సీ, బొంబాయి రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్, భారతదేశం ) జన్మించారు.భారత రాజకీయ కార్యకర్త, మహాత్మా గాంధీకి సతీమణి ఆమె తన భర్త ప్రోత్సాహంతో, కుమారునితో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఆమె 62 సంవత్సరాల పాటు గాంధీతో కలసి జీవించింది. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొని నిర్బంధాలను కలిసి ఎదుర్కొన్నది. కస్తూర్బాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.











