మహేశ్వరం మండల కేంద్రంలో మాధవన్ జీ కాలేజీల్లో ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం – విద్యార్థుల్లో ఉత్సాహభరిత స్పందన
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మాధవన్ జీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు మాధవన్ జీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాలల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పూజ్య శ్రీ మాథవన్ జీ గారి ఆశీస్సులతో, తెలంగాణ ప్రభుత్వం మరియు కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మొత్తం 130 మంది విద్యార్థులు పాల్గొని విశేష ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు పలు పోటీలను నిర్వహించారు. అందులో క్విజ్, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖనం, వ్యాసరచన వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యం నింపాయి.
పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మాధవన్ జీ హాస్పిటల్స్ ఎండీ పి. తరుణ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాధవన్ జీ కాలేజ్ డైరెక్టర్ పి. హరిప్రసాద్, కళాశాల నిర్వహణ అధిపతి సి.హెచ్ అమర్నాథ్, ప్రిన్సిపల్, ఉపన్యాసకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మొత్తం కార్యక్రమం విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు దోహదపడేలా సాగింది.











