ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం తెలుసా?

ప్రజా గొంతుక ఏప్రిల్ 13, ఎల్కతుర్తి:హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్భాపూర్ గ్రామంలో ఇప్పటికి భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు, మరి అదో అడవి ప్రాంతం కాదు, మూల గ్రామం కాదు వరంగల్ -హుజురాబాద్ హై వే పైన ఉన్న వల్భపూర్ అనే గ్రామం, ప్రతీ ఏట అంబేద్కర్ జయంతి ఉత్సవం ప్లెక్సీ తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు, అనంతరం వచ్చే ఏడాది తప్పకుండా విగ్రహం ప్రతిష్ఠాపన చేయాలని నిర్ణయం చేస్తున్నారు, అనంతరం ఒకరు ఒక చోట పెట్టాలని సూచిస్తే ఇంకొందరు మరో చోట పెట్టాలని సూచించారు, కొందరు చిన్న విగ్రహం సూచించారు, మరి కొందరు పెద్దది మాత్రమే అని సూచించారు, ఇలా గత 20 సంవత్సరాల నుండి ఇదే విధంగా కొనసాగుతూనే ఉంది, ఒకరు పెట్టడం లేదు, వేరే వారిని పెట్టనివ్వడం లేదని నిరుత్సాహం చెందుతున్నారు అంబేద్కర్ వాసుల మరి రేపు ఎలా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతాయో చూడాలి.











