*పులిమామిడి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని పులిమామిడి గ్రామపంచాయతీ పరిధిలోని ఆధ్వర్యంలో గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి, మహానేత అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.*
*ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆశయాలు, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.*
*ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంబడి రమేష్ , ఉప సర్పంచ్ పాపగాళ్ళ రాములు , వార్డ్ మెంబర్లు అలువల అనురాధ అశోక్ , అనగోని మల్లేశ్వర వెంకయ్య, గంగవరం మల్లేష్ , బట్టు అంజనేయులు, జాల ప్రవీణ్, పాపగళ్ల మహేష్,గ్రామ కార్యదర్శి రాజు గౌడ్ , అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు రేవెల్ల సాయికుమార్ , అలాగే నాగేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.*











