అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం.తెల్లం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేద్దామని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లంవెంకట్రావుఅన్నారు.భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,పలువురు అధికారులు,రాజకీయ నాయకులు, సర్పంచులతో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బార్ భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు.అటువంటి మహనీయుని ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని వెల్లడించారు.దానిలో భాగంగా భద్రాచలంనియోజకవర్గాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.చర్లమండలపరిధిలోనిసత్యనారాయణపురం గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు, మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఏటీసీ కేంద్రం ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.అనంతరం తహసిల్దార్ ఎం శ్రీనివాస్,ఎంపీడీవో కె.ఈదయ్య మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే నేడు అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం సమాన హక్కులు లభిస్తున్నాయని గుర్తు చేశారు.చర్ల సీఐ ఏ రాజు వర్మ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని,దేశంలో అన్ని వర్గాల ప్రజల సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తి అని అన్నారు.ఆయన చూపిన బాటలో విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఆర్.నర్సిరెడ్డి,పి.కేశవ్, పంచాయితీ కార్యదర్శి తోకల సురేష్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,పంచాయతీ ఉప సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, ప్రముఖ కాంట్రాక్టర్ కొటెరు శ్రీనివాసరెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు రామకృష్ణ, చీమలమర్రి మురళీకృష్ణ,పోలిన లంక రాజు,జిల్లా టిడిపి నాయకులు,రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు,ఆటో యూనియన్ అధ్యక్షులు పామర్రు బాలాజీ,ఆత్మ కమిటీ చైర్మన్ ఇందల బుచ్చిబాబు,అంబేద్కర్ విగ్రహ నిర్మాణ,జయంతి ఉత్సవ కమిటీ సమన్వయకర్త కొంగూరు రమణారావు,అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తడికల లాలయ్య,మచ్చారామారావు, జయంతి ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు,సీనియర్ పాత్రికేయులు దొడ్డా ప్రభుదాస్, కొంగూరు నరసింహారావు,కమిటీ కార్యదర్శి బందెల చంటి, ఉపాధ్యక్షులు ఎడెల్లి గణపతి, మచ్చ రాజా,కోశాధికారులు మచ్చ వీరభద్రం,మోత్కూరి ప్రభాకర్, సభ్యులు పొడుపుగంటి సమ్మక్క, కట్ట అమ్మాజీ,అలవాల కృష్ణ, నరసింహమూర్తి,కాళ్ళ కృష్ణ,తోటమల్ల విజయరావు, కారంపూడి సాల్మన్,కొప్పుల రాంబాబు,కొంగూరు సత్యనారాయణ,కొంగూరు శ్యామసుందర్,మేడబత్తిని గోవర్ధన్, చిట్టిమల్ల మురళి,మైపా జోగారావు,ముసలి సతీష్ తదితరులు పాల్గొన్నారు.











