సూర్యాపేట ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
ప్రజా గొంతుక న్యూస్, (ఏప్రిల్ 14)సూర్యాపేట:భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సూర్యాపేట ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడుగుంట్ల గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.రాజ్యాంగం కల్పించిన ఫలాలు సమాజంలోని అట్టడుగు స్థాయి వ్యక్తికి కూడా అందేలా చూడటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మన్సూర్ బాయ్,రాజు,సత్యం,అలీ భాయ్,శ్రీను,పవన్,చిన్న శ్రీను,మనో,భవాని,కీర్తి,సతీష్,సత్తి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 27











