మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి……..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:15
లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదు
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ
140 వ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను పల్లె పల్లెనా వాడవాడనా కార్మిక వర్గం జరుపుకోవాలని ఆ స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దయేంతవరకు పోరాటం చేయాలని సిఐటియు రాష్ట్ర సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ* కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బుధవారం సిఐటియు మండల జనరల్ బాడీ సమావేశం స్థానిక మండల కేంద్రంలో సిఐటియు మండల కన్వీనర్ కోమండ్ల గురువయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడి సాధించిన స్ఫూర్తిగా మేడే వచ్చిందని కానీ నేడు కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్ని రద్దుచేసి కార్మిక హక్కులు కాలరాస్తున్న నేపథ్యంలో జరుగుతున్న మేడేలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనలను తెలియజేయాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద యుద్ధం, మతోన్మాదం పెరిగి కార్మిక వర్గం హక్కులపై ఐక్యతపై తీవ్రమైన దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన ఎన్నికల హామీలు ఈ మేడే సందర్భంగా అయినా అమలు చేయాలని కోరారు. కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడుతుంటే ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్స్ లో నిర్బంధిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ మేడేలో కార్మిక వర్గం తమ ఐక్యతను ప్రభుత్వాలపై తమ నిరసనను ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. మే 1 నుండి 7 వరకు జరిగే వారోత్సవాలను పల్లె పల్లెనా వాడ వాడన కార్మిక వరకు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కందుకూరి కోటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఆకారపు నరేష్, మల్లికంటి చంద్రశేఖర్, వెంపటి మహేష్, ముత్యాల కేశవులు, గుత్తా శ్రీనివాస్ రెడ్డి, కోరే రమేష్బొ,డ్డు లింగయ్య, అంజమ్మ మేరెమ్మ, సైదమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు











