మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులపై సమావేశం.

ప్రజా గొంతుక న్యూస్/ సుల్తానాబాద్ రిపోర్టర్/ నూక రాందాసు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్‌లో గురువారం రోజున . ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో మండల్ , మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. పట్టణ మరియు మండలం అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై అధికారులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు.











