*బార్ అసోసియేషన్ దేవరకొండ*
*ప్రజా గొంతుక ఏప్రిల్ 18 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
తేదీ 18 4 2026 శనివారం రోజున దేవరకొండ న్యాయస్థానంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు తనికి నిమిత్తమై “గౌరవనియులైన నల్లగొండ జిల్లా పోక్సో కోర్ట్ ప్రత్యేక న్యాయమూర్తి శ్రీ కులకర్ణి విశ్వనాథ్ దిలీప్ రావు గారు” విచ్చేశారు.
సందర్భంగా వారు న్యాయస్థానం ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెట్లను నాటారు.
అనంతరం బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నల్లగొండ జిల్లా పోక్సో కోర్ట్ ప్రత్యేక న్యాయమూర్తి శ్రీ కులకర్ణి విశ్వనాథ్ దిలీప్ రావు మాట్లాడుతూ న్యాయవాదులు ఈ ప్రాంత పరిధిలోనీ కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని,ఈ ప్రాంతంలోని కక్షిదారులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక న్యాయవాదులు పనిచేసి పెండెన్సి తగ్గించాలని కోరారు.
కార్యక్రమంలో దేవరకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె.వి.ఎస్ హరీష్ బాబు , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్నేహ , దేవరకొండ డి ఎస్ పి శ్రీనివాసరావు, సిఐ వెంకట్ రెడ్డి , బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సన్నాయిల ఉమామహేశ్వర్, వనం జగదీశ్వర్, సీనియర్ న్యాయవాదులు గాజుల ఆంజనేయులు, నెమ్మికంటి గౌరీ శంకర్, ఏ జి పి నెమ్మికంటి రమాశంకర్, ఎండి శోకత్ అలీ, ఇంద్రవరప్రసాద్, ఈ. రవి, సి హెచ్ అశోక్, ఎస్ శ్రీకాంత్, జె ఇద్దయ్య, గణేష్, ఆంజనేయులు, ఏ కృష్ణ, కె సురేష్, బి సాయి, ఎన్ చంద్రశేఖర్, రాజకుమార్, రమేష్, శివ, సూపర్టెండెంట్లు అజార్ అలీ, సరిత, గిరిధర్ మరియు కోర్టు సిబ్బంది, కోర్టు పోలీసు వారు పాల్గొన్నారు.











