ప్రైవేటు బడి వద్దు – ప్రభుత్వ బడి ముద్దు
. ప్రజా గొంతుక ఏప్రిల్ 20:హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించిన అవగాహన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. “ప్రైవేట్ బడి వద్దు – ప్రభుత్వ బడి బెటర్” అనే నినాదంతో గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జె. దుర్గభవాని మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు భారీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని తల్లిదండ్రులను కోరారు.
ప్రస్తుతం ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులో ఉండగా, అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలియజేశారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పీడీ, రాముడు, శ్రీదర్ రిజ్వానా, శ్రీలత పాల్గొన్నారు. వారు గ్రామంలోని వాడవాడల తిరుగుతూ తల్లిదండ్రులను కలుసుకొని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులను ఎంపిక చేసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు పిలుపునిచ్చారు











