పదవిలో ఉన్నంత కాలం ఇంటి టాక్స్ ఇబ్బందులు ఉండవు = సర్పంచ్ వినోద్ రాథోడ్
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 23:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పడమటి తండా గ్రామా సర్పంచ్ వినోద్ రాథోడ్ మాట్లాడుతూ,, ఎన్నికలలో హామీలో భాగంగా నేను ఇచ్చిన మాట ప్రకారం పడమటి తండా మరియు ఎన్టీఆర్ తండా ప్రజలకు ఐదు సంవత్సరాల వరకు ఇంటి టాక్స్ పూర్తిగా కడతానని ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం గాను రెండు లక్షల 25 వేల రూపాయలను మొదటి సంవత్సరంలో చెల్లించడం జరిగింది అదేవిధంగా పదవిలో ఉన్నంతకాలం గ్రామ ప్రజలకు ఇంటి టాక్స్ విముక్తి ఉంటుందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో…
గ్రామ సర్పంచ్ కాట్రావత్ వినోద్ రాథోడ్ ,ఉప సర్పంచ్ రాజు నాయక్, వార్డు సభ్యులు శ్రీను,బాబు లాల్,సేవ్య, రమేష్ నాయక్, బుజ్జి,లక్ష్మణ్, సురేష్, భాస్కర్, మోహన్,హరిచంద్, శ్రీకాంత్, మధు, మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి దివాకర్ మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు











