వి.బి.జి.రాంజీ. స్కీంను ఉపసంహరించుకోవాలి. వ్య. కా. స. డిమాండ్….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:23
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయడం గ్రామీణ పేదలను మరింత పేదలుగా చేసేటటువంటి నిర్ణయాలు చేయడం లో భాగంగానే ఇటీవల పార్లమెంటులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి వి బి జి రంజీ స్క్రీన్ ను తీసుకొచ్చిందని వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి కోటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం వారు మాట్లాడారు. ప్రతి ఏటా ఉపాధి హామీకి రెండున్నర లక్షల కోట్లు అవసరం ఉండగా 63 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుండి క్రమంగా బడ్జెట్లో నిధులు తగ్గించి చట్టాన్ని నేరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రికరణ ఆధునికరణ పెరిగిన కారణంగా గ్రామీణ పేదలు కూలీలు పని దొరకక బస్సులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారన్నారు. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి 800 రూపాయలు కూలి తగ్గకుండా ఇవ్వాలని, పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించి చేసిన పనికి వారం వారం పే స్లిప్పులు ఇవ్వాలని,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై భారాలు పెట్టకుండా 100% కేంద్రమే నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈకేవైసి ద్వారా రెండు పూటలా ఫోటో తీసే విధానం తో వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, దానిని రద్దు చేయాలని వారు కోరారు. గ్రామీణ పేదలకు జీవనాధారమైన ఉపాధ్యాయుని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఉపాదాన్ని సిబ్బందిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు భూమిలేని పేదలకు వ్యవసాయ కార్మికులకు ఏటా 12000 రూపాయలు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కోమండ్ల గురువయ్య ఉపాధి హామీ కూలీలు దుర్గయ్య, శంకరయ్య,చినరాములు, వెంకయ్య,నాగమణి, ధనమ్మ, యశోద, మణెమ్మ,కాశమ్మ,రాజు,యశోద,సునీత, పద్మ, పావని, మంగమ్మ, శైలజ, అంతమ్మ,సత్యవతి, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.











