రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి 50 వేల 116 రూపాయలు
విరాళంగా అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా గొంతుక ఏప్రిల్ 23:హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఈనెల 26 27 28. తేదీలలో జరగనుంది అందుకుగాను ఎల్కతుర్తి గౌడ సంఘం నాయకులు గౌడ కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి కళ్యాణ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది అందువుగాను మంత్రి పొన్నం ప్రభాకర్ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి నా వంతుగా గా 50 వేల 116 రూపాయలు కానుకలుగా అందజేస్తానని గౌడ సంఘం సోదరులకు తెలియజేశారు అందుకుగాను గురువారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గౌడ సంఘం నాయకులకు 50,116 రూపాయలు నగదు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ మా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి కానుకలు అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి కానుకలు అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు కళ్యాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుకినే సంతాజి. గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్. మార్కెట్ డైరెక్టర్ గొడిశాల రాజయ్య గౌడ్. యాదగిరి గౌడ్. శనిగరపు వెంకటేష్. డాక్టర్ రమేష్. అంబాల శ్రీకాంత్. జనగాని లక్ష్మీనారాయణ గౌడ్. అర్జున్ గౌడ్. రమేష్ చారి. బుచ్చి రాములు గౌడ్. శ్రీపతి సదానందం. మహేష్ చారి. మరియు గౌడ సంఘం నాయకులు. గొడిశాల కుమార్ గౌడ్. మాజీ అధ్యక్షులు రవి. రాజేష్. సుమన్. విక్రమ్. కుమారస్వామి. శ్రీకాంత్. సురేష్. మహిపాల్. కుమార్. తదితరులు పాల్గొన్నారు











