? *మండల న్యాయ సేవాధికార సంస్థ దేవరకొండ*
*ప్రజా గొంతుక ఏప్రిల్ 23 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో యుపిఎస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చిన్నారులందరికీ నోటుబుక్స్ కిట్ తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ సహకారంతో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి కె అనిత పాల్గొని చిన్నారులందరికీ నోట్ బుక్స్ కిట్స్ అందజేసి, నేటి బాలలే రేపటి పౌరులు చిన్నారులందరు బాగా చదువుకొని రాబోవు రోజుల్లో చదువుకున్న స్కూలుకు, గ్రామానికి, ఈ దేశానికి పేరు తీసుకురావాలని కోరారు . కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గాజుల ఆంజనేయులు, ఏ జి పి నెమ్మికంటి రమాశంకర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలు సన్నాయిల ఉమామహేశ్వర్, వనం జగదీశ్వర్, సభావాత్ శ్రీకాంత్, జున్ను ఇద్దయ్య, ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.











