గ్రామపంచాయతీ నిధులు గోల్ మాల్ పై ఫిర్యాదు.. సందర్శించిన డీఎల్పిఓ ఫైల్స్ సిజ్ చేసి తరలింపు.

ప్రజా గొంతుక( ఏప్రిల్ 25 )కాల్వ శ్రీరాంపూర్: వెన్నంపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ పాలనలో గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం పై వ్యక్తి ఫిర్యాదుమేరకు విచారణ చేపట్టిన డిఎల్పిఓ దేవకిదేవి. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన కరబుజా రవికుమార్ అనే వ్యక్తి గ్రామపంచాయతీ 2024-25 సంవత్సరానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ పాలనలో గ్రామపంచాయతీ నిధులు ట్రాక్టర్ డీజిల్, ఇంటి పన్నుల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పై పిర్యాదు చేయగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్( డిఎల్పిఓ) దేవకి దేవి గ్రామపంచాయతీకి సందర్శించారు. సంబంధిత ఫైల్స్ పరిశీలించి, రెండు సంవత్సరాల లావాదేవీలు పరిశీలించాలి గనుక, సంబంధించిన ఫైల్స్ ను సిజ్ చేసి తీసుకువెళ్లి, వాటిని క్లుప్తంగా పరిశీలించి, జిల్లా కలెక్టర్ అందజేయునట్లు వారు తెలిపారు. అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని వారు అన్నారు. అలాగే గ్రామపంచాయతీకి వచ్చిన ప్రతి రూపాయిని గ్రామసభల ద్వారా గ్రామ ప్రజలకు జమ ఖర్చులు తెలియపరచాలని వారు అన్నారు. గ్రామాలలో గ్రామపంచాయతీ అధికారులు, గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆదేశాల మేరకు జారీ చేసిన పనులను గ్రామంలో శానిటేషన్, మౌలిక వసతులును ప్రజలకు సౌకర్యార్థం గా అందించాలని గ్రామ పాలన అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నట్లు వారు తెలిపారు. ఫిర్యాదుదారుడు శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మా వెన్నంపల్లి గ్రామంలో 2024 -2025 జనరల్ ఫండ్, సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్, సంబంధించిన నిధులు గ్రామ స్పెషల్ ఆఫీసర్ అప్పటి ఏవో నాగార్జున హయాంలో, గ్రామ కార్యదర్శి గ్రామ సభలు, ఫోరం తీర్మానం లేకుండానే, నిధులు ఇష్టానుసారంగా వినియోగించుకొని నిధులు దుర్వినియోగం చేయడం జరిగిందని, అలాగే ఇంటి పన్నులకు సంబంధించిన ఆన్లైన్లో అమౌంట్ కంటే, ఎక్కువగా వసూలు చేసి, నిధుల దుర్వినియోగం చేయడం జరిగిందని వారిపై చట్టపర్యమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నా ఫిర్యాదు మేరకు ఉన్నత అధికారులు ఈరోజు సంబందిత అధికారిని గ్రామపంచాయతీకి రావడం జరిగిందని, నిధులు దుర్వినియోగం పై క్లుప్తంగా పరిశీలించి, దుర్వినియోగం చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు బాధితుడు రవికుమార్ తెలిపారు.











