*పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఆవు,దూడ అందజేత*
*దాత నల్లచెరువు తాండ దన్నాడ వెంకటేష్ యాదవ్*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నల్ల చెరువు తండకు చెందిన దాత దన్నాడ వెంకటేష్ యాదవ్…. కొత్తూరు మండలంలో పెంజర్ల శ్రీ స్వయంభు అనంతపద్మనాభ స్వామి ఆలయానికి మహేశ్వరం మండలం నల్లచెరువు తాండకు చెందిన దాత దన్నాడ వెంకటేష్ యాదవ్ ఆవు,దుడను ఆలయ కమిటీ చైర్మన్ బెజవాడ అనిత రెడ్డి,మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి అందజేసినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో పాత్లావత్ సందీప్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.
వెంకటేష్ యాదవ్ కుటుంబానికి ఆ పద్మనాభ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకున్నారు











