*మండలంలో మెరిసిన సెయింట్ థామస్ ఆల్టిట్యూడ్ హై స్కూల్
ప్రజా గొంతుక:ఎల్కతుర్తి, ఏప్రిల్ 29:
పదో తరగతి ఫలితాల్లో సెయింట్ థామస్ ఆల్టిట్యూడ్ హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో మంచి ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని ఎన్. కృష్ణవేణి 546 మార్కులు సాధించి మండలంలో రెండవ స్థానం దక్కించుకోవడం విశేషం.
ఈ విజయంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల కరస్పాండెంట్ పుస్కూరి కార్తిక రావు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం విద్యార్థులను విజయ మార్గంలో నడిపిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవీన్, వైస్ ప్రిన్సిపల్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతి, ఉపాధ్యాయులు సరిత, లావణ్య, సురేష్, ఆశా బేగం, రమేష్, సరిత తదితరులు పాల్గొన్నారు.











