గోపాల మిత్రుల సేవలకు నష్టం వాటిల్లే ప్రమాదం..
గోపాల మిత్రుల సమస్యలను పరిష్కరించాలి…
విరుద్ధంగా ఉన్న జీవోను సవరించాలి..
ప్రజా గొంతుక వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ సంపత్ రావు ను ఉమ్మడి వరంగల్ జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు గోపాల మిత్రులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ24/4/2026 రోజున టీ జీఎల్ డి ఏ వారు ఇచ్చిన ప్రో ,ఆర్ఓసి. నెంబర్ .859/3/డి ఎ 2026 లెటర్ లో చెప్పిన సూచనలు గోపాల మిత్రుల యొక్క విధులకు ఆటంకం కలిగించేలా మరియు గోపాలమిత్రులకి నష్టం వాటిల్లేల ఉన్నవని భావిస్తూ, ఇట్టి సూచనల అమలు కొరకు గోపాల మిత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత అమలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. సమావేశం ఏర్పాటు చేసే వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోపాల మిత్రులము ఎవరూ కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని ముక్తకంఠంతో తెలియజేస్తున్నాము.మా యొక్క ఉద్దేశాన్ని అంగీకరించి త్వరగా సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార దిశగా నిర్ణయం తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో చెంచల లక్ష్మీనారాయణ వరంగల్ జిల్లా అధ్యక్షులు, కళ్లెపు సుదర్శన్ హనుమకొండ జిల్లా అధ్యక్షు లు,మారబోయిన రవీందర్ ములుగు జిల్లా అధ్యక్షులు, బొల్లెపల్లి శ్రీనివాస్ గౌడ్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, యాటెల్లి ఆంజనేయులు జనగామ జిల్లా అధ్యక్షులు,జేరిపోతుల సుధాకర్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఉమ్మడి వరంగల్ జిల్లా గోపాల మిత్రులు పాల్గొన్నారు.











