ఘనంగా మహా కుంభాభిషేకం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాత చర్ల ఉమా రామ లింగేశ్వర స్వామి వారి ఆలయం పుణ ప్రతిష్టించి రెండు పుష్కరాలు అయిన సందర్భంగా ఆలయ ఆవరణలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు.మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం మొదటి రోజయిన మంగళవారం ఆలయ అర్చకులు సాయికృష్ణ శర్మ నేతృత్వంలో వేద పండితులు సంకట హర చతుర్థి,మహా గణపతి హోమం,నవ గ్రహ హోమం,లక్ష్మీ గణపతి హోమం,రుద్ర హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో కార్యక్రమం ముగిసింది.పుణ పత్రిష్ట జరిగిన రోజయిన బుధవారం మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని కనులారా మహా కుంభాభిషేకం తిలకించి పరవశం పొందారు.అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలను స్వీకరించి మహా అన్నదానంలో పాల్గొన్నారు











