*స్నేహానికి నిలువెత్తు నిదర్శనం కుమార్తె పెళ్లికి అండగా నిలిచిన మిత్రులు*

*వధువును మెట్టినింటికి సాగానంపిన తండ్రి స్నేహితులు*
కీర్తి శేషులు కంసలి లక్ష్మి నారాయణ జ్ఞాపకాలు ఇంకా స్నేహితుల హృదయా ల్లో సజీవంగానే నిలిచాయి. ఆయన లేని లోటు కుటుంబానికి తీరనిదైనా, ఆ కు టుంబానికి తామున్నామనే భరోసాను ఆయన స్నేహితులు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని 1987-1988 బ్యాచ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు,విద్యార్థినీలు మరోసారి చాటిచెప్పారు. వివాహానికి ముందు రోజు లక్ష్మి నారాయణ కుమార్తె వినీల కు పుస్తెలు, మెట్టెలు, పెళ్లి వస్త్రాల కు 55 వేలు మరియు దానితో పాటు రూ.1,53,000 నగదును అందజేసి తమ ఆప్యాయతను తెలియజేశారు. పెళ్లి తదనంతరం ఇంటికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.”నీకు అండగా మేము న్నాం..ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యం గా ముందుకు సాగాలి” అంటూ ఆమెకు మనోధైర్యం నింపారు. తండ్రి స్థానంలో నిలబడి స్నేహితులు చూపిన ప్రేమ, బాధ్యత అందరినీ కదిలించింది.
అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆశీర్వాదాల మధ్య మంచి చీరను తీసుకోమని కొంత నగదును ఇస్తూ వధువును ఘనంగా మెట్టినింటికి సాగనంపారు. ఆనందం, భావోద్వేగం కలిసిన ఆ క్షణాలు నిజమైన స్నేహానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో స్నేహ బంధు సభ్యులు పాల్గొన్నారు.











