*పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభను మహావిజయం చేద్దాం! = కప్పటి పాండురంగారెడ్డి*

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 07:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. చౌదర్ గూడ మండల కేంద్రము లో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించే పాలమూర్ – రంగారెడ్డి ప్రాజెక్ట్ సాధన సభా స్థలిని గురువారం తెలంగాణ రక్ణణ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి
రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, నారాయణ్ పేట్ అధ్యక్షుడు గవినోళ్ళ శ్రీనివాస్, షాద్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ చీమల రమేష్, సమన్వయ కర్తలు చిలుక ప్రవీణ్ , శీలం వీరెందర్,చామర్తి శీతారామ్,నాయకులు శ్యామ్,శ్రవణ్ గౌడ్,శివరామకృష్ణా రెడ్డి తదితరులు పరిశీలించిన అనంతరం విలేఖరులతో వారు మాట్లాడుతూ..
తెలంగాణ బీడు భూములకు జీవం పోసి, దక్షణ తెలంగాణ రూపురేఖలను మార్చగల ఏకైక సంజీవని “పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం”.
ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి, మన బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కాలన్న సంకల్పంతో తెలంగాణ రక్షణ సేన వ్వవస్థాపక అధ్యక్షురాలు తలపెట్టిన “పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ” కు రైతన్నలు.. యువకులు.. మహిళలు!
భారీ ఎత్తున తరలిరావాలని తెలంగాణ రక్షణ సేన పక్షాన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.
తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఈ మహాసభ ఒక కీలక ఘట్టం. ఈ సభను విజయవంతం చేయడానికి సమాజంలోని ప్రతి వర్గం కదలిరావాలని ఎండిన బీడు భూములను సస్యశ్యామలం చేసి, మన బతుకులను పచ్చగా మార్చేది సాగునీరే. మన పొలాలకు దక్కాల్సిన నీటి వాటా కోసం, భవిష్యత్తు తరాల కోసం మీరంతా ఏకమై ఈ సభలో గొంతు కలపాలి. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు యువతే వెన్నెముక. ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెంది, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. నవసమాజ నిర్మాణానికి మీ అడుగులే మార్గదర్శకం కావాలి.
మహిళలకు తాగునీటి గోస తీరాలన్నా, ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలన్నా ఈ ప్రాజెక్టు ఎంతో అవసరం.
మన నీటి హక్కు… మన భవిష్యత్తు… మన బాధ్యత.
నీటి కోసం మనమంతా ఒక్కటై పోరాడుదాం. సభను విజయవంతం చేద్దాం!











