అల్లూరి సీతారామ రాజు కు ఘన నివాళులు

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో స్వాతంత్య్ర సమర యోధుడు,మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు,ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు,గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం సాగించిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. “అల్లూరి సీతారామరాజు యువ తకు స్ఫూర్తి ప్రదాతఅని దేశభక్తి, ధైర్యసాహసాలకు ఆయన ప్రతీక” అని పేర్కొన్నారు.ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.











