జల్పల్లిలో జనగణన అవగాహన ర్యాలీ నిర్వహణ
*జనగణన విధుల్లో నిర్లక్ష్యానికి 52 మందికి షోకాజ్ నోటీసులు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం మే:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల కేంద్రం లోని జల్పల్లి సర్కిల్ కార్యాలయంలో మే 11వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించబడనున్న జనగణన కార్యక్రమానికి సంబంధించి సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఛార్జ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ కమిషనర్ బి.వెంకట్ రామ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ:-సూపర్వైజర్లు ప్రతిరోజూ తమ ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో విధులు సమర్థవంతంగా నిర్వహించేలా పర్యవేక్షించాలని సూచించారు.జనగణన విధుల నుండి ఎవరికి కూడా మినహాయింపు లేదని,ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.విధుల్లో నిర్లక్ష్యం వహించిన 52 మందికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.అనంతరం సూపర్వైజర్లు,కార్యాలయ సిబ్బందితో కలిసి జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సహకరించి తమ వివరాలను సమర్పించి జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ కమిషనర్ కోరారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వినయ్ కుమార్,కార్యాలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి,అభిరామ్, వినయ్,లోకేష్,నరేష్,మహేష్,సురేష్ మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.











