కాంగ్రెస్ పీఠం దళితులకే కేటాయించాలి
రాష్ట్ర నాయకులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్‌కు వినతి
జనగామ డీసీసీ కార్యాలయంలో కలిసిన బచ్చన్నపేట దళిత సంఘాలు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని దళిత నాయకుడికే కేటాయించాలని ఆ పార్టీ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జనగామలోని డీసీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్‌ను దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పదవిని దళిత సామాజిక వర్గానికి కేటాయించి, ఈ ప్రాంత దళితుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాలని కోరుతూ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పడమటి కేశ్వాపూర్ మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్, కొడవటూరు టెంపుల్ మాజీ డైరెక్టర్ మొద్దు బాల భాస్కర్, బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కళ్లెం రమేష్, పార్టీ నాయకులు బొట్టు గణపతి, బచ్చన్నపేట మండల టౌన్ ప్రధాన కార్యదర్శి కర్రె నరేష్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందారం క్రాంతి, అల్వాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.











