నీట్ పరీక్ష రద్దుకేంద్రం విద్యకేంద్రీకరణ వల్లనే
ఎన్ టి ఏ రద్దు చేసి, రాష్ట్రాలకు పరీక్ష నిర్వహించుకునే హక్కు కల్పించాలి…..
ఆకారపు నరేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14వరుసగా పేపర్ లీకులు అవుతున్న కనీసం చర్యలు తీసుకోవడం లేదు.తక్షణమే కేంద్రం స్పందించి నీట్ పరీక్ష అభ్యర్థులకు న్యాయం చేయాలిఆకారపు నరేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు హాలియా: మే 3న దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష, ఎన్ టి ఏ తప్పిదం వల్లన లీక్ అయ్యిందని లాల్ ఎన్ టి ఏ నిర్ధారించి పరీక్ష ను రద్దు చేయడం వల్లన సుమారు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్ అంకారంలోకి పోతుందని అన్నారు.దేశంలో పరీక్షలను కేంద్రం రాష్ట్రాల హక్కులను లాక్కుని విద్యా కేంద్రీకరణ వల్లన పరీక్షల నిర్వహణ లో పారదర్శకత లేకుండా వరుసగా పేపర్ లీకులు అవుతున్నాయని అన్నారు. గతంలో 2024 లో నీట్, నెట్ పరీక్షలు లీకై రద్దైనప్పుడే ఎన్ టి ఏ పారదర్శకత, పరీక్షల నిర్వహణ లో అనేక అనుమానాలు ఉన్నాయని అయిన వాటిని సరిదిద్దుకోకుండా మళ్ళీ వరుసగా పేపర్ లీకులు జరుగుతున్నాయన్నారు. ఎక్కడో ఒక రాష్ట్రంలో లీక్ అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. అందుకే విద్యా వికేంద్రీకరణ చేయాలని, రాష్ట్రాల జాబితాలోని ఉన్న విద్యా హక్కులను కేంద్రం లాక్కొని కేంద్రీకరణ వలన అనేక విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు.తక్షణమే నీట్ లీకేజీపై సమగ్రమైన విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నీట్ లీక్ వలన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ చేస్తుంది. ఎన్ టి ఏ ను రద్దు చేసి, ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని, తక్షణమే కేంద్రం స్పందించాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ చేస్తుంది.











