చర్ల కాంగ్రెస్ మండలఅధ్యక్షుడిగా విజయ్ కుమార్
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజయ్ కుమార్ నాయుడు నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలో ఎంతోకాలంగా క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న విజయ్ కుమార్ నాయుడుకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి,ప్రజలకు చేరువ చేసే విధంగా కృషి చేస్తానని విజయ్ కుమార్ నాయుడు తెలిపారు.తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కార్యకర్తలందరిని కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు.విజయ్ కుమార్ నాయుడు నియామకాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు స్వాగతిస్తూఅభినందనలు తెలిపారు.











