E-PAPER

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

15 May 2026, 2:23 pm DISHA POWER

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

--BKMU జిల్లా కార్యదర్శి కర్రె లక్ష్మణ్ డిమాండ్

ప్రజా గొంతుక మే 15, ఎల్కతుర్తి:గత 20 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా గ్రామీణ పేదల కొనుగోలు శక్తిని ఎంతో కొంత పెంచినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రూపుమాపే ప్రయత్నంలో భాగంగా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నదని, వచ్చే ఈ కొత్త చట్టం పేదలకు ఉపాధిని దూరం చేసేది గానే ఉండబోతుందని భారతీయఖేత్ మజ్దూర్ యూనియన్ bkmu ( తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ) హన్మకొండ జిల్లా నాయకత్వం అభిప్రాయపడింది. దశాబ్దాలుగా పేదలు చేసిన పోరాటం లో భాగంగా, వామపక్ష పార్టీల సహకారంతో వచ్చినటువంటి ఈ విప్లవాత్మకమైన చట్టాన్ని ఎప్పుడెప్పుడు రద్దు చేద్దామా అని అదను కోసం చూస్తున్న బిజెపి తను మూడోసారి అధికారంలోకి రాగానే చట్టాన్ని తొలగించడానికి తద్వారా పేదలకు ఉపశమనంగా ఉన్నటువంటి అవకాశాన్ని ఊడదీయడానికే పూనుకున్నదని, ఇది అత్యంత హేయమైన చర్య అని సంఘం జిల్లా అధ్యక్షులు మునిగొండ బిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదునూరి వెంకటరాజం ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్ లు అన్నారు.  ఈరోజు ఎల్కతుర్తి మండలం లోని దామెర, చింతలపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సంఘం స్థానిక భాద్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరుతెన్నులను కూలీల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు ఎర్రటి ఎండలో చేస్తున్న పనికి సరైన కూలీ గిట్టడం లేదని, పనిచేసే చోట నీడ, మంచినీటి వసతులు అసలే లేక అల్లాడుతున్నామని సంఘ నాయకులకు తెలియజేశారు. ప్రభుత్వం చెప్పిన దినకూలి రూ. 362 ఎక్కడ కూలీలకు దక్కడం లేదని, ఏ గ్రామంలోనూ 300 రూపాయలకు మించి దిన కూలి పడనందున కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని కూలీలు వాపోయారు. సమ్మర్ అలావెన్ సులతోపాటు ఇతర అలవెన్స్లు కూలీలకు దక్కడం లేదని ఈ సందర్భంగా సంఘం నాయకుల దృష్టికి వచ్చింది. పని అడిగిన కూలీలకు అందుబాటులో పనులు లేవని చెబుతున్నారని ఈ సందర్భంగా నాయకులకు కూలీలు తెలియజేశారు.ఈ పరిస్థితులలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించడమే కాకుండా, మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత సీజన్ లో జరుగుతున్న పనుల్లో కూలీలకు కలుగుతున్న అసౌకర్యాలను పరిష్కరించాలని, సమ్మర్ అలవెన్సులు కలుపుకొని కనీస వేతనం అమలయ్యేలా చూడాలని అధికారులను డిమాండ్ చేశారు.  ఉపాధి హామీ సమస్యలపై గ్రామీణ పేదలని సమీకరించి రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIKS జిల్లా కార్యదర్శి ఊటుకూరు రాములు, సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్, నాయకులు తండ మొన్డయ్య తదితరులతోపాటు కూలీలు పాల్గొన్నారు.

Generating image…

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

–BKMU జిల్లా కార్యదర్శి కర్రె లక్ష్మణ్ డిమాండ్

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!