దళిత వర్గాలకే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి కేటాయించాలి — దళిత కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ దళిత ముఖ్య నాయకుల సమావేశని నిర్వహించారు,సందర్భంగా వారు మాట్లాడుతూ బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవిని దళితులకే కేటాయించాలని జనగామ డిసిసి అధ్యక్షురాలు లక్కవత్ ధనవంతి, ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రితంల ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించారు. బచ్చన్నపేట మండలంలో జనాభా నిష్పత్తి ప్రకారం మండల అధ్యక్ష పదవిని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం దళితులు అహర్నిశలు కృషి చేస్తారని దళితులను పనులకే వాడుకోవడం తప్ప పదవులు ఇచ్చిన పాపన పోలేదని దళితులకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పడమటికేశపూర్ మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకులు కళ్లెం రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంధారం క్రాంతి కుమార్, బచ్చన్నపేట టౌన్ ప్రధాన కార్యదర్శి కర్రె నరేష్, సీనియర్ నాయకులు అల్వాల్ రమేష్, మొద్దు బాల భాస్కర్, పాకాల చిరంజీవి, నర్సింగ ఎల్లేష్, బెజగం నరేష్, అల్వాల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.











