బహిరంగ ప్రదేశాలలో రోడ్లమీద చెత్త వేస్తే జరిమానాలు తప్పవు………..
హాలియా మున్సిపాలిటీ కమిషనర్….. కే రవీందర్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:19నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం పురపాలక సంఘం హాలియా పరిధిలో వర్తక వ్యాపారులకు మరియు దుకాణదారులకు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకూడదు మరియు తడి చెత్తను,పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనానికి అందించాలని పలుమార్లు నోటీసులు మరియు పత్రికల ద్వారా తెలియజేసినప్పటికీ వాటిని పాటించకుండా చెత్తను బహిరంగ ప్రదేశాలు మరియు రోడ్లమీద వేసిన వారికి మిర్యాలగూడ రోడ్డులోని, మరియు సాగర్ రోడ్డు నందు వర్తక వ్యాపారులకు జరిమానాలు విధించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హలియా మున్సిపాలిటీ సానిటరీ ఇన్స్పెక్టర్ అంజయ్య , పర్యావరణ ఇంజనీర్ రవికుమార్, మున్సిపల్ సిబ్బంది, జవాన్లు పాల్గొన్నారు.
Post Views: 28











