నూతన ఎంపీడీవోను సన్మానించిన బిఆర్ఎస్ సర్పంచులు..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
“మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన లావణ్య ను మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి పిరోజ్ మండల బిఆర్ఎస్ సర్పంచ్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవోకు శాలువా కప్పి, బొకేలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి, పెండింగ్ పనులు, మరియు స్థానిక సమస్యలపై ఎంపీడీవోతో సర్పంచ్లు చర్చించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో సహకరించాలని వారు కోరారు.రాజకీయాలకు అతీతంగా మండల ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన ఎంపీడీవో సర్పంచ్లకు హామీ ఇచ్చారు. పలు గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.











