పెంబర్తి పెద్ద చెరువుకు నీరివ్వాలి
–ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి పెంబర్తి గ్రామ రైతుల వినతి
ప్రజాగొంతుక ప్రతినిధి/జనగామ:చీటకోడూరు కుడి కాలువకు సంబంధించిన పెండింగ్,అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేసి,పెంబర్తి పెద్ద చెరువులోకి సాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి రైతులు, బిఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.బుధవారం ఎమ్మెల్యేను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాలువ పనులు అసంపూర్తిగా ఉండటం వల్ల చెరువులోకి నీరు చేరడం లేదని,దీంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.రైతుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తక్షణమే స్పందించారు.సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి,క్షేత్రస్థాయిలో పరిశీలించి కాలువ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి పెంబర్తి చెరువుకు నీరందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిద్దిలింగం,రైతులు బండ్రు సోమయ్య,ఐలా యాదగిరి, మేకల ఐల మల్లేష్,నిడిగొండ జగన్,ఆకుల శ్రవణ్,నీర్మాల వినయ్,బండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.











