హాలియా మెడికల్ అసోసియేషన్ తరఫున, దేశవ్యాప్త బంద్‌కు మద్దతుగా స్వచ్ఛందంగా మెడికల్ షాపుల బంద్………
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:20ఈ బంద్ ఉద్దేశం: 1. ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలను నిషేధించడం.2. నాసిరకం మందుల అమ్మకాలను అరికట్టడం.3. హెచ్-1 (హెచ్1) మందుల విచ్చలవిడి విక్రయాలను నియంత్రించడం.ఈ అంశాలపై ప్రభుత్వం జోక్యం చేసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా కోట్లాది మెడికల్ షాప్ యజమానుల మనుగడ దెబ్బతినకుండా చూడాలని, కార్పొరేట్ వ్యవస్థల ఆధిపత్యాన్ని అరికట్టాలని మేము కోరుతున్నాము.ఈ డిమాండ్లతో హాలియాలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, బంద్ పాటించడం జరిగింది.ఈ ర్యాలీలో హాలియా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లు కృష్ణారెడ్డి, కార్యదర్శి సాంబశివరావు, కోశాధికారి ఎండి రషీద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వీరయ్య, ప్రవీణ్ కుమార్ మరియు పలువురు మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు. అలాగే, తులసి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ మాలె సంతోష్ రెడ్డి, డాక్టర్ బద్రి, డాక్టర్ సురేష్ పాల్గొన్నారు.











