.గద్వాల జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కురుమన్న నియామకం.
హర్షం వ్యక్తం చేసిన కాశపోగు జాన్.
గద్వాల జిల్లా ప్రతినిధి మే 20 ( ప్రజా గొంతుక):జోగులాంబ గద్వాల జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ &మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కురుమన్న ఎంపిక కావడం పట్ల దళిత సంఘాలు,ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సహకారంతో ఆయన ఈ కీలక బాధ్యతలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.ఈ సంద ర్భంగా దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ మాట్లాడుతూ సామాజిక న్యాయం సాధనలోనూ,దళితుల హక్కుల పరిరక్షణలోనూ కురు మన్న నిరంతరం ముందుండి పనిచేస్తున్నారని కొనియా డారు.సమాజ సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహన,సేవా భావం కారణంగానే ఈబాధ్యతలకుఎంపికయ్యారనిపేర్కొన్నారు.జిల్లాలో ఎస్సీ,ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం,సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, హక్కుల పరిరక్షణలో కురుమన్న కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ బాధ్యత ఆయన ప్రజాసేవకు మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టుల ఫోరం రెండు రాష్ట్ర సలాదారుడు రంజిత్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షుడు తాటికుంట తిరుమల్ పాల్గొన్నారు.











