*గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలి సర్పంచ్ బిల్లా యాదగిరి*
ప్రజా గొంతుక మే 21 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:
వేలేరు మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యూత్ అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేలేరు మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను ఎంఆర్వో కోమీ, ఎంపీడీవో అనిల్‌కుమార్, ఎస్‌హెచ్‌వో సురేష్‌కుమార్, ఎంఈవో చంద్ర మొగిళి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో నియోజకవర్గంలో క్రీడాకారుల కోసం ప్రత్యేక గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ పీఆర్ రూపవతి, ఏపీఓ విజయ, ఉపసర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి సంపత్‌కుమార్, వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్, వార్డు సభ్యులు, క్రీడాకారులు, గ్రామస్థులు పాల్గొన్నారు..











