మే, 24 న చలో మహబూబ్ నగర్.
*ముస్లిం రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే సభను జయప్రదం చేద్దాం
*ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్వాల అతికూర్ రహమాన్.*
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ముస్లిం డిక్లరేషన్ అమలుకు నోచుకోలేదు. ముస్లిం మైనార్టీ ప్రజలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు రుణాలు రావడం లేదు. దేశంలోను, రాష్ట్రాలలోనూ మతోన్మాదుల సోషల్ మీడియా వేదికగా విద్వేష పూరీతమైన ప్రసంగాలతో దేశం ప్రమాదకరంగా మారుతుంది. భారతదేశంలోని బడా పెట్టుబడిదారుల్లో ముస్లింల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇది మత మైనార్టీలకే కాదు సబ్బండవర్గాలకు యావత్ భారతదేశానికి విపత్తుగా మారుతుంది. ఈ సందర్భంలో భాగంగా స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, భావ ప్రకటన, ఆర్థిక రాజకీయ సాధించే దిశగా మహబూబ్ నగర్ లో ముస్లిం మరియు సబండ వర్గాల భావ సారూప్యత సమ్మేళన సభ ను నిర్వహిస్తున్నాము. ఈ సభలో ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, మరియు బీ. సీ పీడిత సమూహాలు కదలి రావాలని అందరిని ఆహ్వాని స్తున్నాము. తేదీ : 24/05/2026, ఆదివారం సమయం సాయంత్రము 6 గంటలకు వేదిక షాలిమార్ ఫంక్షన్ హాల్, న్యూ టౌన్, మహబూబ్ నగర్.ఈ కార్యక్రమంలో మహమ్మద్ రహమ తుల్లా, ఇక్బాల్ భాష, చాంద్ పాషా, మహమ్మద్ ఇబ్రహీం, యూనుస్ తదితరులు పాల్గొన్నారు.











