బచ్చన్నపేట తెలంగాణ ఉద్యమకారుల మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
మండల అధ్యక్షుడిగా కోనేటి స్వామి, ప్రధాన కార్యదర్శిగా రాపెల్లి వెంకటేశ్వర్లు
తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమమే ధ్యేయంగా బచ్చన్నపేట మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక శ్రీ దుర్గామాత దేవస్థాన ప్రాంగణంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన సుమారు 30 మంది మలిదశ ఉద్యమకారులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలుపాలైన, పోలీస్ కేసులు మరియు బైండోవర్లు ఎదుర్కొన్న వారిని గుర్తించి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయి, ప్రస్తుతం ఆర్థికంగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఉద్యమకారుల కుటుంబాల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం ఈ కమిటీ నిరంతరం పాటుపడుతుందని తీర్మానించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ నందగిరి రజినీకాంత్, జనగామ జిల్లా అధ్యక్షులు గుజ్జుక రాజు, జిల్లా కన్వీనర్ కండింగుల బాలకృష్ణ, మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈగం శ్రీనివాస్ ల ప్రత్యేక ఆమోదంతో.. కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు కమిటీ గౌరవ సలహాదారులు: నల్లగోని బాలకిషన్, బోడిగం చంద్రారెడ్డి, దొంతుల చంద్రమౌళి, బోడ కుంటి మల్లయ్య.అధ్యక్షుడు: కోనేటి స్వామి. ఉపాధ్యక్షులు: బొమ్మెన ఆంజనేయులు, వేముల లక్ష్మణ్ గౌడ్, నీల రమేష్, బోడిగం శ్రీపాల్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి: రాపెల్లి వెంకటేశ్వర్లు.సహాయ కార్యదర్శులు: గంధ మల్ల నరేందర్, కాపర్తి హరిప్రసాద్, ముసిని బాబు.కోశాధికారి: బంగారు మహేష్.కార్యవర్గ సభ్యులు: ఎండీ జావేద్, పిడుగు మహేష్, పోచంపల్లి శివకుమార్, జూకంటి కిష్టయ్య, నూకల రాజిరెడ్డి, నర్రా భూపాల్ రెడ్డి, ఎండీ షబ్బీర్, జేరిపోతుల అంజయ్య, కంసాని సిద్ధారెడ్డి.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు కోనేటి స్వామి, రాపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, మండల ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపారు. మండల పరిధిలోని ఉద్యమకారులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి, ప్రభుత్వం నుంచి రావాల్సిన గుర్తింపు, సంక్షేమ ఫలాలు అందేలా పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











