E-PAPER

కష్టపడితే విజయం ఖాయం – పోలీసు పిల్లలకు ఎస్పీ ప్రేరణ…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కష్టపడితే విజయం ఖాయం – పోలీసు పిల్లలకు ఎస్పీ ప్రేరణ…

22 May 2026, 8:09 pm DISHA POWER

కష్టపడితే విజయం ఖాయం – పోలీసు పిల్లలకు ఎస్పీ ప్రేరణ...

➤ మెరిట్ విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు...

గద్వాల జిల్లా మే 22 (ప్రజా గొంతుక)జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలకు చెందిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు సాధించిన ప్రతిభను అభినందిస్తూ, వారి విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిభతో మెరిసిన విద్యార్థులందరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.విద్యార్థి దశ జీవితాన్ని మలిచే కీలక సమయమని,ఈ సమయంలో కష్టపడి చదివిన వారే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని పేర్కొన్నారు.చెడు అలవాట్లు, అనవసర వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచిస్తూ,సెల్‌ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. పిల్లలను ఒత్తిడికి గురి చేయకుండా, అదే సమయంలో బాధ్యతతో తీర్చిదిద్దాలని సూచించారు.90 శాతానికి పైగా మార్కులు సాధించడం వెనుక విద్యార్థుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఉన్నాయని కొనియాడారు. చిన్న వయస్సులోనే పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. పోలీసు విధుల్లో నిమగ్నమై కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేకపోయినా, ప్రజల భద్రత కోసం తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అదనపు ఎస్పీ కె. శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయ పాలన, నాయకత్వ లక్షణాలను అలవరుచుకోవాలని సూచించారు. పట్టుదలతో కృషి చేసే వారిని విజయం తప్పక వరిస్తుందని అన్నారు..ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. శంకర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి సతీష్ కుమార్, డీసీఆర్‌బీ ఎస్సై సుకుర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వెంకటస్వామి, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

కష్టపడితే విజయం ఖాయం – పోలీసు పిల్లలకు ఎస్పీ ప్రేరణ…

➤ మెరిట్ విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!