2 గంటలలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ బాధితుడికి అప్పగించిన ఎస్ఐ…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బైక్ మీద వెళుతున్న వ్యక్తి అనుకోకుండా ఫోను పోగొట్టుకోవడంతో పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ 2 గంటల లో సెల్ ఫోన్ బాధితుడికి అప్పగించారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారంమహమ్మద్ అస్లాం (ఝార్ఖండ్) అను వ్యక్తి మోటకొండూరు మసీద్ లో ఇమామ్ గా ఉంటాడు. ఈరోజు మోటకొండూరు నుండి ద్విచక్ర వాహనంపై సలాఖ్ పూర్ వెళుతుండగా బచ్చన్నపేట చేరుకునేసరికి తన యొక్క మొబైల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది. బాధితుడు ఫిర్యాదు మేరకు మొబైల్ ని ట్రేస్ చేసి రెండు గంటలలో తిరిగి బాధితుడికి అప్పగించారు. మొబైల్ జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఒకవేళ ఎక్కడైనా పోయిన పోలీస్ స్టేషన్ కు వచ్చి సంప్రదించాలని తెలియజేశారు. 24 గంటలు పోలీసులు ప్రజాసేవకు అందుబాటులో ఉంటారని అన్నారు.











