హాలియా మున్సిపాలిటీ లో ఉచిత కుక్క పిల్లలకొరకు పేరు నమోదు చేసుకోగలరు…….
కమిషనర్……కే రవీందర్ రెడ్డి పురపాలక సంఘం హాలియా
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:23హాలియా మున్సిపాలిటీ జంతు ప్రేమికులకు విజ్ఞప్తి హాలియా మున్సిపాలిటీలోని జంతు ప్రేమికులకు తెలియజేయునది ఏమనగా మీకు కుక్క పిల్లలను పెంచుకొనుటకు ఆసక్తి గలవారు ఉంటే తేదీ 25.05.2026 సాయంత్రం ఐదు గంటల లోపు మున్సిపల్ కార్యాలయంలో మీయొక్క పేరు నమోదు చేయించుకోగలరు. మరుసటి రోజు తర్వాత పేరు నమోదు చేయించుకున్న వారికి కుక్క పిల్లలను ఉచితంగా పంపిణీ చేయబడును. అదేవిధంగా ఆల్రెడీ కుక్కలను పెంచుకుంటున్న కుక్కలకు వెటర్నరీ డాక్టర్లచే హెల్త్ చెకప్ మరియు ర్యాబిస్ టీకాలు కూడా వేయబడును. కావున ఆసక్తి గలవారు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించగలరని కోరుచున్నాము.
Post Views: 77











