జాఫర్ఖన్ పెట గ్రామంలో గుడిసెకి మంటలు.. సకాలంలో మంటలార్పిన అగ్నిమాపక వాహనాలు…
ప్రజాగొంతుక ( మే 24 )కాల్వ శ్రీరాంపూర్: జాఫర్గావ్ పేట గ్రామంలోని మంటలు అంటుకొని ఇల్లు దగ్ధం, మండల కేంద్రంలో అగ్నిమాపక వాహనం లేకపోవడంతో అనేక అవాస్థలు… మండలంలోని జాఫర్ ఖాన్ పెట్ గ్రామంలో విద్యుత్ షార్ట్కుట్,లేక గుర్తుతెలియవి వ్యక్తులు అంటించడం వలన పొలాలు వరి కొయ్యలు అంటుకొని, వందల ఎకరాలకు మంటలు వ్యాప్తి చెందాయి, గ్రామంలోకి రాగా ఇరవేనా లక్ష్మమ్మ కు చెందిన గుడిసె ఇల్లు కాలిపోయినది.. సకాలంలో గ్రామ సర్పంచ్ జ్యోత్స్న శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపకేంద్రం కి సమాచారం ఇవ్వగా రెండు ఫైర్ ఇంజన్ చేరుకొనగా, గ్రామంలోని యువకులతో కలిసి సర్పంచ్ గ్రామంలో మంటలు అర్పినారు… పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కినట్టు వారు అన్నారు. ఈ ప్రమాదమైన సంఘటనాలు చూసైన సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు మండల కేంద్రంలో అగ్నిమాపాక కేంద్రం ఏర్పాటు చేస్తే, ఇటు ముత్తారంమండలం,ఓదేలమండలం, మండలాలకు దగ్గరగా ఉంటుంది, అధిక పంట నష్టాల నుండి సకాలంలో స్పందించి మంటల ఆర్పే అవకాశం ఉన్నది గనుక, మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు…











