పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు.ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .
ప్రజా గొంతుక న్యూస్/ సుల్తానాబాద్/రిపోర్టర్ నూక రాందాసు
రైతులకు జీలుగ విత్తనాలు పంపిణి..నేను రైతు పక్షపాతిని రైతులకు కష్టం నష్టం కలుగనివ్వను..ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు..రైతులు వరి కొయ్యలను కాల్చకండి..ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .సుల్తానాబాద్ సింగిల్ విండో కార్యక్రమంలో సోమవారం రోజున ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీపై జానుము, జీలుగ విత్తనాలను స్థానిక నాయకులతో కలిసి రైతులకు పంపిణి చేసిన తెలంగాణ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.ముందుగా సింగిల్ విండో చైర్మన్, అధికారులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు కు స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ప్రభుత్వ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ,పంటభూముల సారాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువుల వినియోగమే మేలు అని, ఇందుకోసమే తమ ప్రభుత్వం రైతులకు జీలుగ విత్తనాలను 50శాతం రాయితీపై అందిస్తోందని అలాగే విత్తనాలు నాటి ఏపుగా పెరిగిన పైరును భూమిలో కలియదు దున్నితే భూసారం పెరుగుతుందన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. సేంద్రియ ఎరువుల వాడకంతో పెట్టుబడి తగ్గి దిగుబడి ఎక్కువగా రావడం వల్ల రైతులు ఎక్కువ లాభాలు పొంద వచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి సాగులో యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు..గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి రైతుల ధాన్యంలో కోతలు పెట్టి నట్టేటముంచిన వారే ఈరోజు నీతులు పలుకుతున్నారని విమర్శించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వారి ధాన్యం కొనుగోలు క్వింటలకు 10 నుండి 15 కిలోల వరకు కోతలు విధించి వారి నడ్డి విరిచిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వనీదేనని అన్నారు.ప్రజాప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కటింగ్ లేకుండా అన్నదాతలకు అండగా ఉంటున్నాము అని అన్నారు. తడిసిన రంగు మారిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు ఎవ్వరూ వరి కొయ్యలను కాల్చకూడదని కోరారు. వరి కొయ్యలను కాల్చడం ద్వారా భూసారం తగ్గిపోతుందని మరియు అగ్ని ప్రమాదాలకు గురవ్వడం జరుగుతుందని దానిని మానుకోవాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు ,కౌన్సిలర్లు , వ్యవసాయ శాఖ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.











