మొదటి విడతలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను పర్యవేక్షించిన…… మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:25
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో కార్యక్రమం లో భాగంగా హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రా రెడ్డి హలియా మున్సిపాలిటీలోని నాలుగో వార్డ్ లో మొదటి విడతలో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను పర్యవేక్షించారు, మౌలిక సదుపాయాలైనటువంటి త్రాగునీరు, డ్రైనేజీల పూడిక, వీధిలైట్లు, రహదారుల వెంట పరిశుభ్రతను పర్యవేక్షించడం జరిగింది. ఇట్టి పర్యవేక్షణలో 4 వార్డ్ కౌన్సిలర్ సలహాదారు కడమంచి శీను , మున్సిపల్ సిబ్బంది, వార్డ్ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Post Views: 30











