విద్యుత్ ప్రమాదంలో ఒక గేదె మృతి …చిన్నారులకు గాయాలు…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలంలోని, మనసాన్పల్లి గ్రామంలో ఉదయం సుమారు 07:30 గంటల సమయంలో విద్యుత్ షాక్ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారంగ్రామానికి చెందిన గడిచర్ల బిక్షపతి (66) తన వ్యవసాయ భూమిలో ఒంటరిగా గుడిసెలో నివసిస్తూ మిరప పంటను కోతుల నుండి రక్షించేందుకు ఇనుప తీగలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, దానికి విద్యుత్ మోటార్ స్టార్టర్ ద్వారా కరెంట్ కనెక్షన్ ఇచ్చినట్లు తెలిసింది.ఈ క్రమంలో పొరుగు రైతుల పిల్లలు చొక్కా హర్షిత, గోపిక మరియు అవినాష్ గేదెను మేపేందుకు పొలానికి వెళ్లగా, విద్యుత్ ప్రవహిస్తున్న ఫెన్సింగ్‌ను తాకడంతో షాక్‌కు గురయ్యారు. గేదె అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు చిన్నారులకు కాళ్లపై స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.











