మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది..
ప్రజా గొంతుక (మే 25 )కాల్వ శ్రీరాంపూర్:మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో నూతన మహిళా స్వశక్తి భవనానికి సర్పంచ్ పురుషోత్తం భాగ్య రవీందర్ తో కలిసి, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళికతో ముందుకు వెళుతున్నమన్నారు. ప్రతి గ్రామం లో గ్రామ సమాఖ్య భవనాలు నిర్మించి,మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సర్పంచ్ భాగ్య రవీందర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తమ లక్ష్యమని, విద్య మహిళ సంక్షేమం పేదల గృహ అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు. గ్రామం లో చేయబడుతున్న అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ పవన్ కుమార్,ఏపిఎమ్ లవ కుమార్, ఉప సర్పంచ్ కడెం మహేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డ్ సభ్యులు గీత రాజయ్య, మచ్చ సంపత్, గుంటి సుశీల పురుషోత్తం అనిత, తదితరులు ఉన్నారు.











