కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను కంటికి రెప్పల కాపాడుకుంటాం..
కొడుకును కోల్పోయిన సర్పంచ్ కన్నీరు తుడిచిన మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలంకంటికి రెప్పలా సాది, ప్రయోజకుడవుతాడని ఆశపడ్డ కన్నకొడుకు.. నూరేళ్ల జీవితాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో సగంలోనే ముగించేసి అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయి. బచ్చన్నపేట మండలంలోని ,బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నల్ల సిద్దినర్సమ్మ – మల్లయ్యల కుమారుడు నల్ల వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన వార్త నియోజకవర్గాన్ని కలచివేసింది. ఈ హృదయవిదారక విషయం తెలుసుకున్న జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆమె బసిరెడ్డిపల్లి గ్రామానికి తరలివచ్చి, పుత్రశోకంతో విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను చూసి చలించిపోయారు.కన్నీరు తుడిచి.. గుండెకు హత్తుకొని:బాధిత తల్లిదండ్రులను ఓదార్చేందుకు మాటలు చాలక, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి వారిని గుండెకు హత్తుకొని కన్నీరు తుడిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊరి ప్రజల కష్టాలను తీర్చే సర్పంచ్ కుటుంబానికి ఇంతటి పెద్ద కష్టం రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలున్న యువకుడు ఇలా రోడ్డు ప్రమాదానికి బలికావడం గుండెలను పిండేస్తోందన్నారు. తన వంతుగా ఆ కుటుంబానికి తోడుగా ఉంటూ రూ. 10,000 నగదును తక్షణ ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గార్లపాటి మహిపాల్ రెడ్డి, మినులాపురం జలంధర్, ఇందిరమ్మ కమిటీ మెంబెర్ కామిడి బుచ్చిరెడ్డి, శివకుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు బలాగోని కనుకయ్య,గ్రామ ఉపాధ్యక్షుడు చెప్పాలా కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.











