బాల్య వివాహ రహిత గ్రామ పంచాయతీ గా (రత్నతిరుపతి) హజారిగూడెం….
ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ కూన్ రెడ్డి భాస్కర్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:27నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం హజారిగూడెం (రత్నతిరుపతి) గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ కూన్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూన్ రెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహలు చట్ట రీత్యా నేరం చదువుకునే వయసులో అభం శుభం తెలియని మైనర్లకు బాల్య వివాహలు చేయడం చాలా నేరం అని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శ్రీదేవి ,పంచాయతీ కార్యదర్శి సుజాత, సంఘబంధం అధ్యక్షురాలు ఆశ, మరియు తదితరులు పాల్గొన్నారు
Post Views: 30











