జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో జిల్లా అధ్యక్షుడు రామాంజనే యులు ఆధ్వర్యంలో

-జిల్లా ప్రశిక్షణ సన్నాహక సమావే శం.
-ఈ కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా జిల్లా ప్రశిక్షణ ఇంచార్జ్ అయ్యం గారి ప్రభాకర్ హాజరు.
జోగులాంబ గద్వాల జిల్లా మే 28 (ప్రజా గొంతుక):
జోగులాంబ జిల్లా ప్రశిక్షణ కార్యక్రమం జూన్ 4,5వ తేదీలలో ఎస్ వి ఈవెంట్ హల్ లో ఉం టుంది. ఈ ప్రశిక్షణా శిబిరం 4వ తేదీ ఉదయం 7:00 గంటలకు ప్రారంభమై 5 తేదీ సాయంత్రం 5:00గంటల వరకు ఉంటుందని అన్నారు. శిక్షణ శిబిరంలో మహ బూబ్ నగర్ పార్లమెంటు సభ్యు రాలు డీకే అరుణమ్మ రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, బిజెపి నాయకులు 200 మంది హాజరవుతారని అన్నారు.. ఈ శిబిరంలో 11 అంశాలు శిక్షణ కార్యక్రమం ఉంటుందని అన్నారు.. బిజెపి పార్టీలో ప్రతి 3సంవత్స రాలకు జాతీయ స్థాయి, జిల్లాస్థా యి, మండలాలలో శిక్షణ తరగ తులు నిర్వహించడం ఒక బీజేపీ పార్టీకే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా,జిల్లా ప్రశిక్షణ ప్రబారి రామచంద్ర రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు ల్,జిల్లా ప్రధాన కార్యదర్శి లు రవి కుమార్ ఎక్బోటే కె కె రెడ్డి ,పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ జిల్లా మహిళ మోర్చా సమత గౌడ్, కౌన్సిలర్ చంద్ర శేఖర్ తదితరులు ఉన్నారు.











